• Sampada Srustinche Rahasyam

    0

    ధనవంతులయ్యేందుకు ఓ శాస్త్రం ఉంది.

    ధనవంతులు కావడానికి ఓ శాస్త్రం ఉంది. అది.. బీజ గణితం లేదా అంకగణితం వంటి కచ్చితమైన శాస్త్రం. సంపదను సంపాదించే ప్రక్రియను నియంత్రించే కొన్ని చట్టాలున్నాయి. ఈ చట్టాలను నేర్చుకుని, పాలించిన తర్వాత ఎవరైనా నిశ్చయంగా సంపన్నుడు కాగలడు. ఒక నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వలన డబ్బు మరియు ఆస్తి యాజమాన్యం లభిస్తుంది. ఉద్దేశపూర్వకంగా గానీ లేదంటే అనుకోకుండా కానీ ఈ నిర్దిష్ట మార్గంలో పనిచేసిన వారు సంపన్నులు అవుతారు. ఈ నిర్దిష్ట మార్గంలో పనులు చేయనివారు ఎంత కష్టపడినా, ఎంత సామర్థ్యం ఉన్నా ‘పేదలుగానే మిగిలిపోతారు. ఇది నిజమని ఈ క్రింది విషయాలు నిర్ధారిస్తాయి.

    ధనవంతులు కావడమనేది పర్యావరణానికి సంబంధించిన అంశం కాదు. ఒకవేళ అదే గనుక నిజమైతే నిరిష పరిసరాలలోని వారంతా సంపన్నులు అవుతారు. ఒక పట్టణంలోని వారో లేదంటే ఒక రాష్ట్రంలోని వారో మాత్రమే ధనవంతులుగా ఉంటారు. ఇతర పట్టణాలు, ఇతర రాష్ట్రాల్లోని వారంతా పేదలుగానే మిగిలిపోతారు. కానీ.. ప్రతిచోటా ధనవంతులు, పేదలు పక్కపక్కనే ఒకే వాతావరణంలో నివసిస్తుంటారు. వారిలో చాలామంది ఒకే వృత్తిలో కొనసాగడం కూడా మనం చూసే ఉంటాం. ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతంలో, ఒకే వ్యాపారంలో ఉన్నప్పుడు వారిలో ఒకరు ధనవంతులుగా మరొకరు పేదలుగా ఉన్నప్పుడు.. సంపన్నులు కావడమనేది ప్రధానంగా పర్యావరణానికి సంబంధించిన అంశం కాదన్న విషయం ఇక్కడ అర్థమవుతుంది.

    కొన్ని వాతావరణాలు ఇతరులకన్నా మరింత ఎక్కువ అనుకూలంగా ఉండొచ్చు. | … ఒకే వ్యాపారంలో ఉన్న ఇదరు వ్యక్తులు ఒకే పరిసరాల్లో ఉన్నప్పుడు వారిలో – విఫలమై.. మరొకరు ధనవంతులు కావడం అనేది ఒక నిర్దిష్ట మార్గంలో ……..

    175.00
    Add to cart
  • Rich Dad’s Retire Young Retire Rich

    0

    శూన్యం నుండి ప్రారంభించి పది సంవత్సరాల కంటే తక్కువ సమయంలో ఎలా ఆర్థిక స్వాతంత్ర్యం పొందాలో చెప్పే పుస్తకం ఇది.

    మీరు కూడా ఎలా చేయగలరో తెలుసుకోండి.

    మీరు జీవితంలో అధిక శ్రమ చేయలేరనుకుంటే

    ఈ పుస్తకం మీకోసమే!
    యౌవనంలోనే ధనవంతులుగా ఎందుకు రిటైర్ కాకూడదు?
    రాబర్ట్ కియోసాకి ప్రపంచంలో కోట్లాది మందికి ధనం పట్ల ఉన్న సాంప్రదాయక ఆలోచనా విధానాన్ని ప్రశ్నించారు. అందులో మార్పు తెచ్చారు. పెర్సనల్ ఫైనాన్స్, బిజినెస్ ఎడ్యుకేషన్ రంగాల్లో పుస్తకాలు, వీడియోల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా శిక్షణ అందిస్తున్నారు. ఆయన రూపొందించిన క్యాష్ ఫ్లో బోర్డ్ గేమ్, సాఫ్ట్ వేర్ గేమ్స్ ఆర్థిక నైపుణ్యాలు పెంపొందించడంలో సరికొత్త దృష్టికోణాన్ని అందిస్తున్నాయి.

    499.00
    Add to cart
  • Repo Mapo Pellanta

    0

    ఓ రైతు బేంక్ కి నగలతో వచ్చి అప్పు ఇవ్వమని కోరాడు. “ఎంత కావాలి?” బేంక్ మేనేజర్ అడిగాడు. “ఐదు లక్షలు సార్.” అతను జవాబు చెప్పాడు. “దాంతో ఏం చేస్తావు?” “ట్రాక్టర్ కొంటాను.”

    అతనికి నిజంగా పొలం ఉందని రూఢీ చేసుకున్నాక మేనేజర్ ఆ నగలు తాకట్టు పెట్టుకుని అప్పిచ్చాడు. కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఆ రైతు వచ్చి బాకీ తీర్చేసి బయటకి నడిచాడు. “ఆగండాగండి. మీ నగలు తీసుకెళ్ళరా?” మేనేజర్ అరిచాడు. “అక్కర్లేదు. అవన్నీ గిల్ట్ నగలేగా. ” ఆ రైతు చెప్పాడు.

    ***

    మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన రేపో మాపో పెళ్ళంట నవల్లోని మనుషుల్లో చాలామంది ఆ రైతులాంటి నిజాయితీపరులు కారు. ఐనా వారు మిమ్మల్ని నవ్విస్తారు.

    1997లో ఆంధ్రప్రభ దినపత్రికలో సీరియల్ గా వెలువడ రేపో మాపో పెళ్ళంట చిత్రవిచిత్రమైన పాత్రలతో, సన్నివేశాలతో, ప్రేమజంటలతో సాగుతూ, హాస్యాభిమానులని, ప్రేమ నవలల అభిమానులని సమానంగా ఆకట్టుకుంటుంది.

    210.00
    Add to cart
  • Raja Ravivarma

    0

    రాజా రవివర్మ(1848-1906).. పరిచయం అక్కర్లేని చిత్రకారుడు. ఈ నవల అతని కళాజీవితాల కలనేత. అతని రంగుల సంరంభాన్ని, బతుకులోని తీపిచేదులను ఇది అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఆధునిక భారతీయ కళలో రవివర్మ స్థానం చెరిగిపోనిది. అతన్ని పొగిడే వాళ్లు ఉన్నారు. విమర్శించే వాళ్లూ ఉన్నారు. విస్మరించే వాళ్లు లేరు.

    భారతీయ కథలను అపూర్వంగా దృశ్యీకరించి, దేవుళ్లను రక్తమాంసాలతో పునఃసృష్టించిన కళాజీవి సాహసగాథ ఈ నవల. కుగ్రామంలో పుట్టిన రవివర్మ స్వయంకృషితో భారతీయ చిత్రకళాభూమిలో అనితరసాధ్యంగా వేసిన కొత్త బాటలోకి ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది. అతని చిత్రాలు రాజసౌధాలనే కాక పూరిగుడిసెలనూ అలకరించిన వైనాన్ని కళ్లకు కడుతుంది.

    ఇది విజయగానం మాత్రమే కాదు. ‘రాజభవనంలో తిని కూర్చోవడం గొప్ప కాద’న్న రవివర్మ తన లక్ష్యసాధన కోసం భరించిన కష్టనష్టాలను, అవమానాలను, అశాంతిని కూడా ఇది పరిచయం చేస్తుంది. ప్రాక్పశ్చిమ నాగరకతలు, కళాసంప్రదాయాలు తలపడిన సంధికాలంలో ఒక సృజనశీలి తన లోపలా, బయటా చేసిన అరుదైన యుద్ధమే ఈ కథ. ఇందులో అతని రంగుల దీపపు వెలుగుతో పాటు దాని క్రీడా కనిపిస్తుంది. .

    ఈ నవల తెలుగు పాఠకులకు రవివర్మను సరికొత్తగా, అబ్బురంగా పరిచయం చేస్తుంది. విశాఖపట్నం, హైదరాబాద్లలో అతని బస విశేషాలూ ఇందులో ఉన్నాయి. అతని కవిత్వమూ పలకరిస్తుంది. రవివర్మకు నమ్మినబంటైన అతని తమ్ముడి కళాజీవితాలూ వెన్నంటి సాగుతాయి. కళాభిమానులకే కాక సాహిత్య ప్రియులకూ ఇది వసంతోత్సవం! –

    రచయిత పి.మోహన్ పాత్రికేయుడు. పుట్టింది కడప జిల్లా ప్రొద్దుటూరులో, అచ్చయిన పుస్తకాలు.. కిటికీపిట్ట (కవిత్వం 2006), పికాసో (2010), డావిన్సీ కళ -జీవితం (2013).

    300.00
    Add to cart
  • Purushulu Kujagrahavasulu, Sthreelu Sukragrahavasulu

    0

    అత్యంత ప్రసిద్దమైన అనుబంధాల కరదీపిక. పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు సుక్రగ్రహవాసులు అనే జాన్ గ్రే రచన కోట్లాది దంపతులకు తమ సంబంధాన్ని మరింత గాడతరం చేసుకోవడానికి ఉపకరించింది. దీనిని ఒక ఆధునిక శాస్త్రీయ గ్రంథంగా చెప్పుకోవచ్చు. స్త్రీ పురుషులకు తమ నిజ వ్యక్తిత్వాలు, ప్రత్యేకతల గురించి తెలియజెప్పడమే కాక, ఇద్దరి మధ్య వైరుధ్యాలు తలెత్తకుండా తమతమ అవసరాల్ని నెరవేర్చుకోవడం ఎలాగో ఈ పుస్తకం నేర్పింది. స్త్రీ పురుష మధ్య గాడానురాగం వృద్ధి చెందడానికి సంబంధించిన ప్రతి అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో కూడా ఈ పుస్తకం చెబుతుంది.

    ఈ పుస్తకం కింద పేర్కొన్న విషయాల్లో సహాయపడుతుంది.

    – ప్రేమాస్పదమైన, శాశ్వతమైన స్త్రీ, పురుష సంబంధాన్ని వృద్ధి చేసుకోవడం.

    – ఎదుటివారి మనోభావనల్ని గ్రహించడం, తదనుగుణంగా ప్రతిస్పందిoచడాన్ని నేర్చుకోవడం.

    – ఎలాంటి కపట్యo, విసిగించడం వంటివి లేకుండా మీ అవసరాల్ని తీర్చుకోవడం.

    – సంక్లిష్టమైన అనుభూతుల్ని ఎదుటివారికి వ్యక్తం చేయడం.

    – వాగ్వివాదాల వల్ల కలిగే బాధను నిరోధించడం.

    – మీ జీవిత భాగస్వామిని, ఉద్యోగ వ్యాపార సహచరుల్ని లేదా స్నేహితుల్ని ఇదివరకటికంటే సమర్థవంతంగా అర్థం చేసుకోవడం.

    – పసుపులేటి గీత

    350.00
    Add to cart
  • Pipe Line Kadha

    0

    అనగనగా ఒకనాడు పాబ్లో, బ్రూనో అనే ఇద్దరు యువకులు ఇటలీలో ఒక గ్రామం లో పక్కపక్కనే నివసించేవారు. వారు వరసకు అన్నదమ్ములు అవుతారు. ఇద్దరూ మంచి స్నేహితులు.
    వారు కనే కలలు కూడా చాల పెద్దవి.
    ఎదో ఒకనాడు ఎలాగో ఒకలా ఆ గ్రామంలో అందరికంటే ధనవంతులు కావడం గురించి వారి నిర్విరామంగా మాట్లాడుకునేవారు. ఇద్దరు తెలివైనవారు, కష్టపడి పనిచేస్తారు. వాళ్లకు కావాల్సింది ఒక అవకాశం మాత్రమే.
    ఒక నాడు ఆ అవకాశం వారిని వరించింది. దగ్గర్లో ఉన్న నదినుంచి గ్రామంలో ఉన్న ఒక పెద్దతొట్టికి నీరు చేరవేయటానికి ఇద్దరు మనుషులను వినియోగించాలని ఆ గ్రామం నిశ్చయించింది. ఉద్యోగం పాబ్లో, బ్రునోలను దొరికింది. తరువాత ఎం జరిగిందో ఈ కథను చదివి తెలుసుకొనగలరు.
    -బర్కి వాడ్జెస్.

    195.00
    Add to cart
  • Prayanam By Malladi Venkata Krishna Mur

    0

    ‘రాజశుక. మంచి పేరు పెట్టారు.’ పూజారి మెచ్చుకున్నాడు.

    ‘నాకు కొడుకు పుట్టాడని మా నాన్నగారికి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన భాగవతం మొదటి స్కంధం చదువుతున్నారు. ఆయనే ఈ పేరు సూచించారు.’ రాజశుక తండ్రి సుబ్బరాజు వివరించాడు.

    ‘పాలు పితికినంత సేపు రాజశుక ఒక చోట ఉండడు.’ పెద్దయ్యాక రాజశుక విన్నాడు.

    ఆర్నెలల్లో 11 జ్యోతిర్లింగాలని రాజకుశ ఏ లాభం కోరి సందర్శించాడు?

    రాజశుక తన ఆథ్యాత్మిక ప్రయాణంలో, తీర్థ యాత్రల్లో ఏం నేర్చుకున్నాడు?

    అతనికి అనేక చోట్ల కలిగిన వివిధ అనుభవాలు ఏమిటి?

    హిందూ సంప్రదాయంలోని సన్న్యాసాశ్రమం నియమాలు ఏమిటి?

    ఆసక్తి కలిగించేలా, హాయిగా చదివించేలా ఆథ్యాత్మికతని రాయగల మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నవల ప్రయాణం.

    జయం, పరంజ్యోతి, విధాత నవలల తర్వాత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన నాలుగో ఆధ్యాత్మిక నవల ప్రయాణం.

    295.00
    Add to cart
  • Padakondu Pannendu Padamoodu

    0

    అదృష్టం అనేది ఉందా? అది మనిషిని కాపాడుతుందా? రక్షరేకు మనిషిని రక్షించగలదా? కోయదొర ఇచ్చే రక్షరేకులో నిజంగా మహత్తు ఉంటుందా?
    ఈ నేపథ్యంలో ముప్పై ఆరు గంటల్లో జరిగే ‘పదకొండు పన్నెండు పదమూడు’ క్రైమ్ నవల, అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠంగా సాగుతుంది.
    మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన ఈ సస్పెన్స్, మిస్టరీ డైరెక్ట్ నవలకి ‘పదకొండు పన్నెండు పదమూడు’ అనే పేరు ఎందుకు పెట్టారో ఊహించగలరా?
    – మల్లాది వెంకట కృష్ణమూర్తి

    230.00
    Add to cart
  • Panigrahanam

    0

    పాణి తల్లి రోడ్ ఏక్సిడెంట్ కి గురైంది. ఆ ప్రమాదం చేసిన సినిమా ప్రొడ్యూసర్ కమలాకరం ఆవిడ చికిత్స కోసం డబ్బు ఇవ్వడానికి తిరస్కరించాడు. పాణి, అతని మేనమామ రోహిత్ ఎం చేసారు? అది వాళ్ళకి ఎం చేసింది?
    పోలీస్ వెంకటస్వామి, డేటిక్టివ్ సింహం, అతని అసిస్టెంట్ బ్రహ్మం, మృదుపాణిని ప్రేమించిన వరవిణ లాంటి పాత్రలతో, కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో క్రైం, ప్రేమ, సస్పెన్స్ లతో సాగె కామెడీ థ్రిల్లర్ పాణిగ్రహణం.

    295.00
    Add to cart
  • Misrani

    0

    ఇది సస్పెన్స్ నవల కాదు. క్రై0 నవల కాదు.
    ఇది స్వతంత్రానికి పూర్వం జైపూర్ సంస్థానానికి చెందిన 84 ఏళ్ళ ఓ మహిళ కథ. కాబట్టి విభజనకి పూర్వం భారతీయ చరిత్ర ఇందులో చదవచు.
    ఇంకా సినిమా అవుట్ డోర్ షూటింగ్ విశేషాలు , వివిధ భారతీయ వంటకాల గురించి, ఓ మహిళ జీవితంలోని అనేక మలుపు తిప్పిన సంఘటనల గురించి ఇందులో చదవచ్చు.
    ఒకటి ఒంటరి అంకె , అందమైన జీవితం, మందాకినీ , జాబిలి మీద సంతకం నవలల్లా ఇది కూడా ఓ మహిళ జీవిత కథ.
    మీ అభిమాన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి అందిస్తున్న 108 వ నవల మిస్రాణి

    260.00
    Add to cart